Official Spokes Person ,Andhra Pradesh Congress Committee

Post Image

At present I am working with our senior congress leaders under the able leadership of Indian National Congress president and Congress Parliamentary Party chairperson Mrs Sonia Gandhi who was ranked as one of the few influential persons on the globe. Further I am maintaining healthy relationship with Congress leaders and cadre too.

బీజేపీ పాలనతో దేశానికి, రాష్ట్రానికి చేటు 

బీజేపీ పాలనతో దేశానికి, రాష్ట్రానికి చేటు 
కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కారు పదేళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ అగ్రదేశాలతో పోటీపడుతూ పురోగమించింది. 2004 నుండి 2014 వరకు దేశంలో ప్రజలకు మేలు చేసే సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, గ్రామీణ ఉపాధి హామీ చట్టం, విద్యా హక్కు చట్టం ,అటవీ హక్కుల చట్టం, 2013 భూసేకరణ చట్టం , నిర్భయ చట్టం, స్ట్రీట్‌ వెండర్స్‌ చట్టం వంటి ఎన్నో చారిత్రాత్మక చట్టాలు తీసుకురావడం జరిగింది. దేశ ఆర్థిక వ ద్ధి రేటు 4 శాతం నుండి 7 శాతానికి ఎగబాకింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అదుపులో ఉన్నాయి. అంతే గాక దేశంలో రైతాంగానికి 70 వేల కోట్ల మేర రుణమాఫీ జరిగింది. పంటల కనీస మద్దతు ధరలు పెరిగాయి. కాశ్మిర్‌ లో శాంతి భద్రతలు అదుపులోఉన్నాయి. రిటైల్‌ వ్యాపారాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వ ద్ధి చెందాయి. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత యూపీఏ ప్రభుత్వానికి దక్కింది. ఆర్థిక వేత్త అయిన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌గారు ప్రధానమంత్రిగా పదేళ్లపాటు దేశానికి అత్యుత్తమ సేవలందించారు. యూపీఏ ప్రభుత్వంలో కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు వస్తే సీబీఐ విచారణకు ఆదేశించిన చరిత్ర ఉంది. 2 జి కుంభకోణం కేసులో అవినీతికి ఆధారాలు లేవని ప్రత్యేక కోర్టు కొట్టి వేసింది. దీనిపై వేల, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లుగా గోరంతలు కొండంతలు చేసి బీజేపీ చేసిన ప్రచారాన్ని మనం చూశాం. యూపీఏ హయాంలో దేశంలో మత సామరస్యత ఫరిడవిల్లింది. ప్రపంచ వ్యాపితంగా ఆర్థిక మాంద్యం తలెత్తినా భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకో నిలబడిందంటే, డాలరుతో పోల్చితే రూపాయి విలువ బలంగా ఉందంటే అది యూపీఏ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల ఫలమే. 
నియంతృత్వం..అప్రజాస్వామికం 
గత నాలుగున్నరేళ్లుగా పాలన సాగిస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు దేశాన్ని అన్ని విధాలుగా తిరోగమనంలోకి నెట్టింది. బి.జె.పి. 2014 ఎన్నికల (కేంద్ర,రాష్ట్ర) మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా వంచన చేసారు. మోడీ ప్రధాని అయిన 100 రోజుల్లో విదేశాల్లోను, దేశంలోను వున్న నల్లధనాన్ని వెలికితీసి అవినీతిని సమూలంగా నిర్మూలిస్తామన్న హామీని పెద్దజోక్‌గా మార్చారు. నల్లధనాన్ని వెలికితీసి ప్రతిపేదవాని బ్యాంకు అకౌంట్‌కూ 15 లక్షల రూపాయలు డిపాజిట్‌ చేస్తామన్న హమీతో ఓట్లుపొంది మోసపుచ్చారు. భాగస్వామ్య పక్షాలపై ఆధారపడే అవసరం లేకుండా ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉండటంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారు యథేచ్ఛగా నియంతృత్వ పోకడలతో, అప్రజాస్వామిక విధానాలతో, కొంతమంది బడా కార్పొరేట్లకు, ఆర్థిక నేరగాళ్లకు కొమ్ము కాస్తూ, ఆర్‌బీఐ, సీబీఐ వంటి కీలక వ్యవస్థలను నాశనం చేయడం ద్వారా దేశాన్ని భ్రష్టు పట్టించింది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న వేలకోట్ల భారీ కుంభకోణాలు,అవినీతిపై విచారణలు లేకుండా రక్షణగా నిలుస్తున్నారు. దేశరక్షణకు సంబంధించి రాఫెల్‌ యుద్దవిమానాలను అధికధరలకు కొనుగోలుచేసి భారీ అవినీతికి పాల్పడ్డారు. దీనిపై పార్లమెంటులో సమాధానం ఇవ్వకుండా దేశప్రజలను వంచన చేస్తున్నారు.బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టిన నీరవ్‌మోడీ, లలిత్‌మోడీ, విజయ్‌మాల్యాలు దేశం విడిచి పారిపోవడానికి సహకరించారు. 
అస్తవ్యస్త ఆర్థిక విధానాలు 
అస్తవ్యస్త ఆర్థిక విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. రూపాయి విలువ దారుణంగా క్షీణించింది. దేశంలో నిత్యావసర సరకుల ధరలు రెట్టింపయ్యాయి. ఆకస్మికంగా పెద్దనోట్లు రద్దుచేసి పెద్దస్కామ్‌ కు పాల్పడ్డారు. స్వతంత్రంగా వ్యవహరించే ఆర్‌.బి.ఐను బ్రష్టుపట్టించారు. సజావుగాసాగే బ్యాంకింగ్‌ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి, బ్యాంకులపై ప్రజలకు అపనమ్మకాన్ని కలిగించారు. ఎటియంలవద్ద అనేకమంది మరణానికి కారణమయ్యారు. ఒకేదేశం, ఒకే పన్ను అని బాకా ఊది ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా అనేక స్లాబులతో, జిఎస్‌టి (గబ్బర్‌సింగ్‌ టాక్స్‌) అమలుచేసి ప్రజలపైన మోయలేని భారం మోపారు. తమకు అధికారం ఇస్తే ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఉపాధి కల్పన చేస్తామని ఇచ్చిన హామీని మర్చిపోవడమే కాకుండా నోట్లరద్దుతో దేశవ్యాప్తంగా లక్షల ఉద్యోగాలు కోల్పోయేలాచేసి యువతను దగా చేశారు. 
బ్యాంకుల దివాలా 
బ్యాంకుల మొండి బకాయిలు 3లక్షల కోట్లకు పెరిగిపోయాయి. సామాన్యులకు, రైతులకు బ్యాంకులనుండి రుణాలు అందడం లేదు కానీ బడా కార్పొరేట్లు మాత్రం వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టిన పరిస్థితిని మోడీ పాలనలో మనం చూస్తున్నాం. కీలక రాజ్యాంగ బద్ధ సంస్థలైన ఆర్‌బీఐ, సీబీఐ పాలనలో మితిమీరిన ప్రభుత్వ జోక్యం వల్ల సంక్షోభాలు తలెత్తడం దేశ ప్రజలను ఆందోళనలో పడేసింది. 

వ్యవసాయం రంగంలో సంక్షోభం 
వ్యవసాయ రంగం సంక్షోభ పరిస్థితి ఎదుర్కొంటోంది. రైతుల ఆత్మహత్యలు ఆపుతామని, వ్యవసాయ పంటలకు గిట్టుబాటుధర 50శాతానికిపైగా పెంచుతామని, హామీ ఇచ్చి, మరిచారు. బడా కార్పొరేటు వ్యాపారులకు లక్షల కోట్లు పన్నురాయితీలు ఇచ్చి దేశరైతాంగాన్ని, వ్యయసాయాన్ని అప్రధానం చేసారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో లక్షలాదిమంది రైతులు ఢిల్లీ వచ్చి మరీ మోడీ ప్రభుత్వ తీరుపై నిరసనలు చేశారు. సమస్యల పరిష్కారానికై ఉద్యమిస్తున్న రైతులపై లాఠీలు, వాటర్‌ కేనాన్‌లు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కింది. పసల్‌ బీమా వంటి పసలేని బీమా పథకాలతో ప్రైవేటు బీమా కంపెనీలకు వేల కోట్లు లబ్ధి చేకూరేలా వ్యవహరిచిన మోడీ ప్రభుత్వం రైతులకు ఎటువంటి మేలు చేయ లేకపోయింది. 
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటడం, స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధిరేటు తగ్గిపోవడం మోడీ సాధించిన ఘనతలు. దేశంలోని దళితులు, గిరిజనులు, ముస్లిం, క్రైస్తవ మైనార్టీలపై నిరంతర దాడులు, అణచివేతలను ప్రోత్సహిస్తూ వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చిత్రించే దుష్పరిణామాలను తీసుకువచ్చారు. 
ప్రశ్నించిన వారిపై దాడులు 
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై సీబీఐ, ఇడి, ఆదాయ పన్ను శాఖలను ఉసి గొలిపారు. వైఫల్యాలను ప్రశ్నించిన రచయితలను, జర్నలిస్టులను హత్యలు జరిగాయి. శ్రీమతి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ గారితో సహా కాంగ్రెస్‌ అగ్రనేతలపై తప్పుడు కేసులు నమోదు చేయించారు. చివరకు పలు రాష్ట్రాలలో దొడ్డి దారిన అధికారంలో కి రావడానికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. దేశ రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లను సమీక్షిస్తామని, సెక్యులర్‌ పదాన్ని తొలగిస్తామంటూ ప్రకటిస్తూ రాజ్యాంగంపైన దాడిచేస్తున్నారు. ఆర్‌బిఐ, ఎన్నికల కమిషన్‌, న్యాయవ్యవస్థ,మీడియా లాంటి సంస్థలను బెదిరిస్తూ వాటి స్వతంత్ర ప్రతిపత్తిని, విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారు. మొత్తంగా భారత రాజ్యాంగంపైనా, ప్రజాస్వామ్యంపైన దాడిచేస్తూ 'రాక్షస పాలన' సాగిస్తున్నారు. 
ఏపీపై 'మోడీ' పంజా
అదే సమయంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన చట్టంలోని అంశాలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం తీరని ద్రోహం తలపెట్టింది. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లిని, బిడ్డని వేరు చేశారని, ఏపీ విభజన అన్యాయమని గొంతెత్తి అరిచిన మోదీ.. ఆ తర్వాత తిరుపతి బహిరంగ సభలో కొండపైనున్న కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న సాక్షిగా కొండ కింద ఆయన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మాట ఇచ్చారు.. ఆ మాటను, ఆ హామీని తుంగలో తొక్కారు. ఏపీని అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రగల్భాలు పలికారు. అవన్నీ నీటి మూటలే అని తేలిపోయాయి. ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజ్‌ ఇస్తామని దానికి కూడా మంగళం పాడేశారు. ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లేదంటున్నారు. కేవలం ఒడిశాలో రాజకీయ ప్రయోజనాల కోసమే విశాఖకు రైల్వేజోన్‌ ఇవ్వడం లేదు. ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చిన మోడీ, అమరావతి శంకుస్థాపనకు రెండు ముంతల్లో మట్టి, నీరు తెచ్చి ఏపీ ప్రజల నోట్లో మట్టికొట్టారు. ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇంతవరకు ఫైనల్‌ ప్రాజెక్ట్‌ డిజైన్‌ రిపోర్ట్‌ను ఓకే చేయలేదు.. వీటితోపాటు 30 వరకు వివిధ విద్యాసంస్థల నిర్మాణానికి కేంద్రం నుండి సుమారు 12 వేల కోట్ల రూపాయలు రావాలి. ఇప్పటిదాకా వీటికి వెయ్యి కోట్లు కూడా కేటాయించలేదు. ఇలా అయితే, ఈ ప్రాజెక్టులు అన్ని పూర్తి కావడానికి కనీసం పదేళ్లు పడుతుంది. విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా రాయలసీమలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకుండా నాటకాలాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మాణం చేపట్టేందుకు పునాదిరాయి వేసే వరకు అయి సుయి లేకుండా ఉన్నవారు ఇప్పుడు ప్రాసెస్‌లో ఉందంటున్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులను ఎగ్గొట్టారు. కరువు నిధుల కేటాయింపులో పక్షపాతం చూపుతున్నారు. ఇలా ఏ విషయంలో చూసినా ఏపీకి అన్యాయమే జరిగింది.. జరుగుతోంది.. దీనిపై పార్లమెంట్‌లో ఒక్క మాటా మాట్లాడలేదు మోదీ.. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ ఎంపీలు కలిసి పార్లమెంటులో ఘోషించినా, నెత్తి నోరు బాదుకున్నా.. సభను అడ్డుకునే ప్రయత్నం చేసినా... ప్లకార్డులు, నిరసనలు వ్యక్తం చేసినా.. చివరికి అవిశ్వాసన తీర్మానం తీసుకువచ్చినా ఆయన తీరు మారలేదు. 
ఏపీలో వైకాపా, జనసేన పార్టీలతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న నరేంద్రమోడీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల మధ్య చిచ్చు రగిలించాలని చూస్తున్నారు. మోడీ సర్కారు రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంటే.. ప్రతిఘటించాల్సిన ఇక్కడి బీజేపీ నాయకులు నిస్సిగ్గుగా సమర్థించుకోవడం బాధాకరం. 
రాష్ట్ర ప్రయోజనాలపై మోడీని ఎందుకు నిలదీయరు? 
మరోపక్క రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోడీ సర్కారును వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌లు ఎందుకు నిలదీయడం లేదు? రాష్ట్ర ప్రయోజనాలు వీరికి పట్టవా? ఈ రెండు పార్టీలు వ్యవహార శైలి చూస్తుంటే బీజేపీకి ఎ, బీ టీముల్లా పనిచేస్తున్నారన్న అనుమానం కలుగుతోంది. వీరికి తోడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం రాష్ట్రం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. హైకోర్టు విభజనపై పలుమార్లు ఢిల్లీ పోయి మోడీతో మంతనాలు సాగించిన ఆయన.. 9, 10 షెడ్యూలు సంస్థలు, ఆస్తుల పంపకంపై పెదవి విప్పరేం? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు ఇవ్వాలని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన ఎక్కడైనా మాట్లాడారా? ఎన్నికలయ్యాక ఇవ్వాల్సిందేనంటున్నారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణకు పరిశ్రమలు రావని, ఉన్నవి ఊడిపోతాయని చెప్పలేదా? ప్రత్యేక హోదా సహా విభజన చట్టం అమలుపై పార్లమెంటులో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు మోడీపై అవిశ్వాస తీర్మానం పెడితే.. కేసీఆర్‌ తన ఎంపీల చేత అడ్డుకున్నారు. ఓటింగ్‌ సమయంలో కూడా మోడీకి అనుకూలంగా వ్యవహరించారు.. ఆంధ్రులను, ఆంధ్ర నాయకులను బూతులు తిట్టకుండా రోజు గడవని కేసీఆర్‌ ఏపీకి వస్తే.. నీరాజనాలు పలికే వారు కూడా ఆంధ్ర గడ్డపై ఉన్నారంటే అంత కంటే దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉందా? తెలంగాణలో టిఆర్‌ఎస్‌ గెలిస్తే ఇక్కడ స్వీట్లు పంచుకుంటారా? వీరందరినీ రాష్ట్ర ద్రోహులుగానే జమ కట్టాల్సి వస్తుంది. రాజకీయంగా కొట్లాడుకున్నా.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఒకే మాటపై ఉండాలన్న ఇంగితం మరచి ప్రవర్తిస్తే ఎలా? ఇక పార్లమెంటులో మోడీ సర్కారును నిలదీయాల్సిన తన ఎంపీల చేత వ్యూహాత్మకంగా రాజీనామా చేయించిన ఘనత వైఎస్‌ జగన్‌కే చెల్లుతుంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన వ్యక్తి, అసెంబ్లీని వదిలేసి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పాదయాత్రలు చేయడం విడ్డూరంగా ఉంది. ప్రజలకు జగన్‌ ఇస్తున్న హామీలు చూస్తుంటే దేశ బడ్జెట్‌కూడా సరిపోదు. అలవి కాని వాగ్ధానాలతో అధికారమే పరమావధిగా రాష్ట్ర ప్రయోజనాలను కాలరాస్తున్నారు. అవినీతి కేసులనుంచి విముక్తి పొందడం కోసం ఏపీని అడుగడుగునా ఇబ్బందుల పాలు చేస్తున్న మోడీ సర్కారుకు కొమ్ము కాయడాన్ని ఏపీ ప్రజలు సహించబోరు. 
మోడీ నిజస్వరూపం ప్రజలకు అర్థమైంది.. 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటల గారడీతో తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ దేశ ప్రజలు ఆయన నిజ స్వరూపాన్ని గ్రహించారు. వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృథా చేస్తూ విదేశాలలో పర్యటించడం మినహా మోడీ దేశానికి చేసిందేమీ లేదని గ్రహించారు. మోడీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా రానున్న ఎన్నికలలో మోడీతో నెగ్గుకోరాలేమని గ్రహించింది. అందుకే ప్రత్యామ్నాయాల కోసం వెదుకుతున్నది. బీజేపీ మంత్రులు, క్రింది స్థాయి కార్యకర్తలే మోడీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పు బడుతున్నారు. అంతిమంగా దేశ వ్యాప్తంగా మోడీకి ఎదురు గాలి వీస్తున్నది. కర్నాటక ఎన్నికలు మొదలుకొని ఇటీవల ఐదు రాష్ట్రాల (మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘడ్‌, మిజోరం, తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. వేల కోట్ల రూపాయలు వెద జల్లినా, ప్రలోభాలకు గురిచేసినా తన కంచుకోటలనుకున్న హిందీ బెల్ట్‌లోనే బీజేపీని ప్రజలు తిరస్కరించారు. 
రాహుల్‌ అంటే వణుకు.. 
దేశంలో తనకు ఎదురేలేదని విర్రవీగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ అంటే వెన్నులో వణుకు పుడుతున్నది. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణం సహా మోడీ సర్కారు దగా కోరు విధానాలను ప్రశ్నించడం ద్వారా రాహుల్‌ గాంధీ దేశ ప్రజల మనసు గెలుచుకున్నారు. ప్రత్యేకించి ఏపీకి జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు లోపల, వెలుపలా కాంగ్రెస్‌ చేసిన పోరాటాన్ని ఐదుకోట్ల మంది ఆంధ్రులు గుర్తించారు. ఆం.ప్ర.కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపైనే ఉంటుందని రాజకీయ ప్రయోజనాలను సైతం పక్కనబెట్టి తెలంగాణాలో సైతం ప్రకటించడం ద్వారా రాహుల్‌ ఏపీపై తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. మోడీ గ్రాఫ్‌ పడిపోవడం.. రాహుల్‌ గాంధీ గ్రాఫ్‌ పెరగడం శుభ సూచకం.. 
కాంగ్రెస్‌ పార్టీకి సాను భూతి పెరిగింది.. 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజలలో ఆగ్రహం తగ్గింది. సానుభూతి పెరిగింది. త్వరలో జరగబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ గణనీయంగా పుంజుకోబోతున్నది. ఈ ఎన్నికలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుకు అత్యంత కీలకమైనవి. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పార్లమెంటు చేసిన చట్టాన్ని సైతం ధిక్కరించి ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం తలపెట్టిన బీజేపీ మరియు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతూ ఆ పార్టీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని అధికారమే పరమావధిగా ప్రజల ముందుకు వస్తున్న పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. 
రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేస్తున్నారో ప్రజలు గ్రహించారు. ఆయా పార్టీలకు తగిన గుణపాఠం నేర్పుతారు. అంతిమంగా దేశంలో కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం అధికారం చేపట్టడం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేకపోయినా కాంగ్రెస్‌ మిత్రపక్షం అధికారం చేపడితేనే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగుతుంది. రాష్ట్రానికి కష్టాలు తీరతాయి. 
- కొలనుకొండ శివాజీ, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి, ఏఐసీసీ సభ్యులు.